Leading News Portal in Telugu

Increased toll fees: పెరిగిన టోల్‌ ఫీజులు..నేటి నుంచి అమల్లోకి..



Increased Toll Fees

Increased toll fees: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నెం.65 లోని టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుమును రోడ్డు విస్తరణ కాంట్రాక్ట్ సంస్థ జీఎమ్మార్ పెంచింది. ఒక్కో వాహనంలో ఒకవైపు, రెండు వైపులా కలిపి రూ. 5 నుంచి రూ. 40 వరకు, స్థానీ కుల నెలవారీ పాస్‌ను రూ.330 నుంచి రూ.340కి పెంచింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు 181.5 కిలోమీటర్ల పొడవునా రెండు వరుసల రహదారిని రూ.2000 కోట్లతో 2012లో జీఎమ్మార్ ద్వారా నాలుగు లేన్లుగా విస్తరించారు.

Read also: TS Students Alret : తెలంగాణ విద్యార్థుల స్కాలర్​షిప్ దరఖాస్తులకు ఇవాళే లాస్ట్..!

ఈ విస్తరణ పనులకు అయ్యే ఖర్చును రికవరీ చేసేందుకు గాను జీఎమ్మార్ ఏపిలోని కృష్ణాజిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద ఒక్కొక్కటి చొప్పున 65వ నెంబరు జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసింది. 2012 నుంచి కాంట్రాక్ట్ కంపెనీ వీటి ద్వారా టోల్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. NHAI నిర్దేశించిన నిబంధనల ప్రకారం వార్షిక సవరణల పేరుతో సంవత్సరానికి ఒకసారి వాహనాల నుండి వసూలు చేసే టోల్ ఫీజు ధరలను పెంచడానికి GMAR సంస్థకు NHAI వెసులుబాటు కల్పించింది. పెరిగిన టోల్ ధరలు సంబంధిత టోల్ ప్లాజాల వద్ద 31వ తేదీ (ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల తర్వాత అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ధరలు ఏడాదిపాటు చెల్లుబాటవుతాయి.
TS Students Alret : తెలంగాణ విద్యార్థుల స్కాలర్​షిప్ దరఖాస్తులకు ఇవాళే లాస్ట్..!