Leading News Portal in Telugu

Palvancha Rural Police: పాల్వంచ పోలీసులు నయా రూల్స్‌.. ట్రాక్టర్‌ కు సీటు బెల్ట్‌ లేదని జరిమానా..!



Palvancha Police Naya Rools

Palvancha Rural Police: మహబూబాబాద్‌ లో ఒక ట్రాక్టర్‌ డైవర్‌ హెల్మెట్‌ పెట్టుకోలేదని జరిమానా విధించన ఘటన 2021లో సంచలనం సృష్టించింది. అయితే అలాంటి ఘటనే ఇప్పుడు మరో సంచలనాన్ని సృష్టించింది. ట్రాక్టర్‌ నడుపుతున్న వ్యక్తి సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు జరిమానా విధించడం పాల్వంచ ప్రజలు బిత్తరపోయేలా చేసింది. ఈఘటన తెలంగాణలోని పాల్వంచలో చోటుచేసుకుంది.

Read also: Khammam: పోడు భూముల వివాదం.. పోలీసులపై కర్రలతో దాడి

సెల్ ఫోన్ చేతపట్టి కనీసం ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన లేకుండా వారికి ఇష్టనుసారంగా జరిమానా విదిస్తున్నారంటూ వాహనదారులు ఆరోపిస్తున్నారు. మరికొందరు వాహన దారులు ఐతే వీరు ఫోటో గ్రాఫర్ల లేక పోలీసులా అని చర్చించుకుంటున్నారు. వీళ్ళందరూ చదువుకొని పోలీసు కొలువు తెచ్చుకున్నది.. ఫోటోలు తీయటానికేనా అంటున్నారు. ఒక విచిత్రం ఏమిటంటే ఒక ట్రాక్టర్ కి సీటుబెల్ట్ లేదని సుమారు పది ట్రాక్టర్ లకు జరిమానా విధించారు ఓ పోలీసు. దీంతో ట్రాక్టర్ యజమానులు ముక్కున వేలేసుకొని ట్రాక్టర్ కి కూడా సీటు బెల్ట్ ఉంటుందా? అని సందేహంలో ఉండిపోయాడు. పిచ్చోడి చేతిలో రాయి అన్న సామెతగా పాల్వంచ రూరల్ పోలీసుల తీరు ఉందని మండిపడుతున్నారు.

Read also: Vemulawada: రాజన్న ఆలయంలో ముగియనున్న ఉత్సవాలు.. నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు

మోటార్ వెహికల్ యాక్ట్ నియమాల ప్రకారం రవాణా శాఖ అధికారుల సలహాలు తీసుకోని వాహనాలకు జరిమాన విధించాలని.. పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. పోలీసు అధికారులు రవాణా శాఖ ఉన్నతాధికారులు వద్ద ఎంబీఐ యాక్ట్ పై శిక్షణ తీసుకోవాలని విమర్శిస్తున్నారు. అయినా చదువులేకున్నా, చదువుకున్నా ట్రాక్టర్ నడిపే వ్యక్తికి సీటు బెల్ట్ ఉండానలని నయా రూల్స్ చెప్పిన పాల్వంచ పోలీసులపై ట్రాక్టర్ యజమానులు మండిపడుతున్నారు. రూల్స్ తెలియదు, ఏమీ చేస్తున్నారో వారికే అర్థం కానీ పరిస్థిల్లో వున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి పోలీసుల తీరుపై నిఘా ఉంచాలని, వారికి రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటి ముందుగా చెబితే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి దీనిపై పై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Nama Nageswara Rao: నాలుగు నెలల్లో ఎన్ని కష్టాలు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలుసు..!