
కేసీఆర్ కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే రైతుల దగ్గరకు వచ్చాడని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారం లో ఉన్నప్పుడు రైతులను ఎప్పుడు అదుకోలేదన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరలకు కరెంట్ కొని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, వై ఎస్ పాలన లో రైతులకు ఎన్నో సబ్సిడీలు ఉండేవి పట్నన్నిటిని తొలగించి కేవలం రైతుబంధును పెట్టి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమన్నారు. మేడిగడ్డ పొంగిపోయిన సమయంలో బి ఆర్ఎస్ అధికారంలో ఉందని ఆమె అన్నారు.
అంతేకాకుండా..’మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కేసీఆర్. మీరు చేసిన తప్పులను సుపరిపాలన అందిస్తున్న కాంగ్రెస్పై నెట్టే ప్రయత్నం చేయొద్దు.. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు చాలా సబ్సిడీలు ఇచ్చాం గిట్టుబాటు ధరలు రైతులకు ఇచిన్న ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానిది. వీటన్నిటిని తొగించి కేవలం రైతు బంధు మాత్రమే ఇచ్చి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో కరెంటు పోతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు.. తెలంగాణా లో రైతులకు విద్యుత్ కోతలు ఎక్కడ లేవు.. కేటీఆర్ పోయే కాలం దగ్గర పడుతుంది. కేటీఆర్ పిచ్చి పిచ్చి మాటాలు మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ బాషా సరిగా లేదంటూనే కేటీఆర్ హౌలే. అంటూ మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడడం నీకు తగదు.. మీ చెల్లలు ఇప్పటికె లోపటి కి వెళ్ళింది.. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో లోపటికి వెళ్ళితే మాట్లాడే చాన్స్ లేదని పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు.. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అడిగే నైతిక హక్కు కేసీఆర్ కానీ బి ఆర్ ఎస్ కి లేదు.. రైతుల నష్టపరిహారం పైనా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. మేడిగడ్డలో నీళ్లను వదిలేంది కేసీఆర్ ప్రభుత్వం మే.. ప్రాజెక్టు లో నీళ్లు లేకుండా చేసింది కేసీఆర్ ప్రభుత్వమే.’ అని ఆయన వ్యాఖ్యానించారు.