
Komatireddy: కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి,దానం నాగేందర్ విజయం కోసం సన్నాహక మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. తుక్కుగుడా బహిరంగ సభ కోసం మాట్లాడినామన్నారు. 10 లక్షల మందిని బహిరంగ సభకు తరలిస్తామన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా నాగేందర్ ను గెలిపించే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. 8న నాంపల్లి లో ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మరో సారి మీటింగ్ ఉందన్నారు.
Read also: MP Sanjay Singh: ఆప్ ఎంపీకి బెయిల్ మంజూరు..
బూత్ కమిటీలు ఏర్పాటుచేస్తున్నామని, భువనగిరి, నల్లగొండ ఖచ్చితంగా గెలుస్తామన్నారు. సికింద్రాబాద్ లో నాగేందర్ ని కూడా గెలిపిస్తాం అన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన.. కాంగ్రెస్ 10 ఏండ్లు అధికారంలో లేకున్నా ఈ సారి గెలిచామన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ ను పట్టించు కోలేదు, అభివృద్ధి చేయలేదన్నారు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తుండు,అది సాధ్యం కాదన్నారు.
Read also: Summer Tips : ఎండలో వెళ్లొచ్చి వాటర్ తాగుతున్నారా? మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే..
కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందన్నారు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్టు ను ప్రక్షాలన చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారని తెలిపారు. హరీష్ రావు మాటలకు అర్థం లేదు.. కేటీఆర్ అంటే కల్వకుంట్ల ట్యాపింగ్ రావన్నారు. వాళ్ళది ట్యాపింగ్ ఫ్యామిలీ అన్నారు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు పడలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: SRH vs CSK: హైదరాబాద్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు ఎంఎస్ ధోనీ దూరం!
సికింద్రాబాద్ పార్లమెంట్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారని దానం నాగేందర్ అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి అందరి సహకారం కావాలన్నారు. తుక్కుగుడా సభ విజయ వంతం చేయడానికి సమావేశమన్నారు.
CIL Recruitment 2024: కోల్ ఇండియా లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు..జీతం ఎంతంటే ?