Leading News Portal in Telugu

Yennam Srinivas Reddy : కేసీఆర్‌, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్‌ను తలపిస్తున్నాయి



Yennam Srinivas Reddy

కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్ ను తలపిస్తున్నాయన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియతో మాట్లాడుతూ.. ఆ దర్బార్ మాటలు వినివిని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిన సిగ్గు రావడం లేదని ఆయన విమర్శించారు. పోలీసుల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని కేసీఆర్‌ పెంచి పోషించారని, ఆ సైన్యంతోనే ఫోన్‌ ట్యాపింగ్ చేయించారన్నారు. ఆ సైన్యమే ఒక్కొక్కటి బయట పెడుతున్నా. కేటీఆర్ ఇంకా ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల సభ్య సమాజం సిగ్గు పడుతోందన్నారు. లీగల్ నోటీసులు ఇస్తానని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ చెబుతున్నాడని, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ కు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా? అని ఆయన ఆయన అన్నారు.

అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమకంటే ముందు మీ ఆస్తులు ఎన్ని ప్రస్తుత ఆస్తులు ఎన్ని? కేటీఆర్ లీగల్ గా ఫైట్ చేద్దామా? అమెరికా నుండి ఇండియకొచ్చినప్పుడు కేటీఆర్ ఆస్తులు ఎన్ని..? సవాల్ ను స్వీకరిస్తావా? చర్చకు సిద్ధమా అని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు.. టెలిగ్రాఫ్ ఆక్ట్ ప్రకారం ట్యాపింగ్ చేయడం దేశ ద్రోహమని, మీ ప్రవర్తనల వల్ల రాష్ట్ర పరువు పోయిందన్నారు. కేటీఆర్ మీకు పరువుందా? పరువు నష్ట దావా వేసే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని ఆయన అన్నారు.