
Kodanda Reddy: కరువు అనేది ప్రకృతి విపత్తు అని.. వర్షాలు, కరువు, వడగండ్లు రైతులపై ప్రభావం చూపిస్తాయని.. కరువు దేని వల్ల వచ్చిందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి పేర్కొన్నారు. గతంలో రైతుల కోసం ప్రభుత్వంలో ఉండి రైతులను పట్టించు కోలేదన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి కేసీఆర్, హరీష్ రావు ఎండిన పంటలు చూపిస్తున్నారని.. హరీష్ రావు గాడి తప్పారన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని బదనామ్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నకిలీ విత్తనాల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఆ సమయంలో వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
Read Also: Telangana: కాంగ్రెస్ జైత్రయాత్రకు నాందిగా ‘జనజాతర’.. 6న భారీ బహిరంగ సభ
తెలుగు దేశం హయాంలో 2004లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి పాడి పశువులు ఇప్పించామన్నారు. ఆత్మహత్యలు జరగొద్దని రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్లారన్నారు. ఈ నాలుగు నెలల్లో 63 మంది రైతులు ఆత్మ హత్యలు జరిగాయని.. అందులో రైతులు కానీ వారు సగం మంది ఉన్నారన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ జీవో తెస్తే కేసీఆర్ ఆ జీవోని మార్చి 6లక్షల ఆర్థిక సహాయం చేస్తానని చెయ్యలేదని తెలిపారు. రైతుల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ ఖమ్మంలో రైతులకు భేడీలు ఎందుకు వేయించారని ప్రశ్నించారు. జైల్లో పెట్టి బజార్లో ఎందుకు తిప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వర్గంలో మంత్రులందరూ కరువును అధిగమించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు.
Read Also: Congress: ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి కంటతడి.. ఎన్నికల స్టంట్ అన్న బీజేపీ
భారత దేశంలో ఎవరు చెయ్యని మోసం రైతులకు కేసీఆర్ చేశారని తీవ్రంగా విమర్శించారు. రైతులకు భూమి హక్కుని ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేశారన్నారు. రైతులకు జరిగిన అన్యాయం గురించి తాను కలుస్తా అంటే కేసీఆర్ తనకు సమయం ఇవ్వలేదన్నారు. కులగణనను తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు. కేసీఆర్ చేపల, గొర్రెల, పశువుల కుంభకోణం చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్కు రాజకీయ విద్య నేర్పింది కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. తెలుగుదేశం హయాంలో కేసీఆర్కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ గురించి మాట్లాడేవాడు కాదన్నారు. నిండు సభలో తెలంగాణ కోసం ఆరోజు ఒక్కసారి కూడా కేసీఆర్ మాట్లాడలేదన్నారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడం కల అన్న ఆయన.. కరువు వస్తే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.