Leading News Portal in Telugu

Avis Hospitals: కొత్త శాఖ‌ల‌తో సేవ‌ల విస్తర‌ణ‌ చేపట్టిన ఎవిస్ హాస్పిట‌ల్స్..



Avis Hospitals

వాస్క్యుల‌ర్ రంగంలో భార‌త‌దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఎవిస్ హాస్పిట‌ల్స్ త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్తరించింది. అందులో భాగంగా.. గురువారం కూక‌ట్ప‌ల్లిలో ఎవిస్ హాస్పిట‌ల్స్ నూత‌న శాఖ ప్రారంభ‌మైంది. ఆసుప‌త్రి ఎండీ, ప్రముఖ ఇంట‌ర్వెన్షన‌ల్ రేడియోల‌జిస్ట్ డాక్టర్ రాజా.వి.కొప్పాల పూజాధికాల‌తో కొత్త ఆసుప‌త్రి సేవ‌ల‌కు అంకురార్పణ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ రాజా మాట్లాడుతూ.. కూక‌ట్ప‌ల్లి శాఖ ప్రారంభంతో త‌మ ఆసుప‌త్రి శాఖ‌లు 23కు చేరాయ‌ని, త్వర‌లో మ‌రిన్ని శాఖ‌ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామ‌ని వివ‌రించారు. ఇక్కడ కూడా నిరంత‌ర సేవ‌లు అందుతాయ‌ని డాక్టర్ రాజా తెలిపారు.

Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం..! అమేథీలో స్మృతి ఇరానీపై పోటీ చేసేదెవరంటే..!

వేరికోస్ వెయిన్స్ విభాగంలో మ‌రిన్ని ఆధునిక విధానాల‌ను అందుబాటులోకి తెస్తున్నామ‌ని, అంతేగాక నూత‌నంగా క్లాక్స్ అనే చికిత్సతో వేరికోస్ వెయిన్స్‌ను పూర్తిగా తొల‌గించే ప్రక్రియ‌ను ప్రారంభించామ‌ని డాక్టర్ రాజా చెప్పారు. ఇప్పటికే త‌మ అన్ని శాఖ‌ల‌లోనూ సుమారు 3500 రూపాయిల విలువైన క‌ల‌ర్ డాప్లర్ టెస్ట్‌ను ఉచితంగా చేస్తున్నామ‌ని గుర్తుచేశారు. కాగా ఇదే రోజున జాబ్లీహిల్స్ రోడ్ నెంబ‌ర్.1లో గ‌ల త‌మ ఎవిస్ హాస్పిట‌ల్స్ కేంద్ర కార్యాల‌యం పాక్షిక ప్రాంగ‌ణాన్ని ఎదురుగా ఉన్నరోడ్డులోని భ‌వ‌నంలోకి మార్చామ‌ని.. ప్రధాన ఆసుప‌త్రిలో సేవ‌లు య‌ధావిధిగా అందుతాయ‌ని తెలిపారు.

Taiwan Earthquake: భూకంపాన్ని ముందే పసిగట్టి, యజమానిని కాపాడిన కుక్క.. వైరల్ వీడియో..

నూత‌న కార్యాల‌య ప్రాంగ‌ణాన్ని ఆసుప‌త్రి డైరెక్టర్ శ్రీ‌మ‌తి సురేఖ రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమాల‌లో ఆసుప‌త్రి డైరెక్టర్లు టి. శ్రీ‌నివాస్, భ‌ర‌త్‌, వైభ‌వ్ , డాక్టర్ సంప‌త్, డాక్టర్ మ‌ల్లీశ్వరి, డాక్టర్ బిందు, ఆసుప‌త్రి అధికారులు సుదీప్త, రాఘ‌వ‌న్‌, ర‌వికిర‌ణ్‌, కుమార్‌, హర్ష, నాగేశ్వర‌రావు, బ‌డే నాగ‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.