Leading News Portal in Telugu

Kishan Reddy: ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా.. ఓటు అడిగే హక్కు లేదు



Kishan Reddy Amberpet

తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సమక్షంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా.. తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలుకోలేదని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీకి 90 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం ఎంపీ సీట్లు, తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.

Kidney Stones: ఈ చిట్కాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు సులభంగా తొలగిపోతాయి..!

ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గాలిలో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఉందని దుయ్యబట్టారు. ఏం సాధించారని తుక్కుగూడలో మీటింగ్ పెట్టుకుంటున్నారని అన్నారు. మరోవైపు.. గ్యారంటీలు అమలు చేయమని సీఎం ఒప్పుకుంటున్నారు.. సీఎం గారు వంద రోజులు అంటే ఎప్పుడు అవుతుంది… డిసెంబర్ అంటే ఏ డిసెంబర్ అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నన్ని రోజులు రాహుల్ ప్రధాని కాడని విమర్శించారు.

IPL 2024: పసుపు మయంగా మారిన ఉప్పల్.. ఎక్కడ చూసినా పసుపు జెర్సీలే

ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఉంటారో.. విదేశాలకు వెళుతారో చూడాలన్నారు. మీకు తుక్కుగూడ ఏపీ, తమిళనాడు, బాంబే మీటింగ్ ఇవే సరిపాయే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో ఈరోజు దీక్షలు చేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని హామీ ఇచ్చామని.. రాష్ర్ట ప్రభుత్వం మాత్రం 5 వందల బోనస్ మాత్రం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు… ఇప్పుడు తుక్కుగూడ సభ పేరుతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు.