
Hyderabad Metro: హైదరాబాద్‌లో ప్రజా రవాణాలో రైలు ప్రధాన మార్గంగా మారింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో మెట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు మండుతుండటంతో ప్రజలు మెట్రో బాట పట్టారు. అయితే ప్రయాణికులను చూసి అధికారులు అవాక్కయ్యారు. మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేసిన అధికారులు రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతేడాది ఏప్రిల్‌లో కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీ సమయాల్లో డిస్కౌంట్ పూర్తిగా రద్దు చేయబడుతుంది. తాజాగా మరోసారి అదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
Read also: Kakarla Suresh: తెలుగుదేశం విజయానికి బీసీలు ఐక్యంగా కృషి చేయాలి..
ఈ నిర్ణయంతో వేసవికి కూల్ జర్నీ చేద్దామనుకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీ కూడా తొలగించబడింది. అయితే ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో రాయితీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో రైలు అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని కోరారు. రాయితీలను రద్దు చేయడంతో.. మెట్రో అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కోచ్‌ల సంఖ్యను డిమాండ్ చేస్తున్నారు.
Himanta Biswa Sarma: పాకిస్థాన్లో అయితే.. మీ మేనిఫెస్టో కరెక్ట్‌గా సరిపోతుంది..