
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించలేదు. రోస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్‌ను నిరాకరిస్తూ ఇవాళ ఉదయం తీర్పు వెలువరించింది. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ వాదనల్లో తెలిపింది. దీంతో వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ పై త్వరగా విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కవిత అశ్రయించనున్నారు. కవిత తరపు న్యాయవాది రౌస్ ఎవిన్యూ కోర్టులో అప్లికేషన్ దాఖలు చేయనున్నారు. గత విచారణ సందర్భంగా రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 20 న విచారణ చేపడతామని కోర్ట్ చెప్పింది. కాగా.. తన కొడుకు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆమె కుమారుడికి ఇప్పటికే ఏడు పరీక్షలు పూర్తయినందున బెయిల్ మంజూరు చేయవద్దని ఈడీ కోర్టును కోరింది.
Read also: Gold Price Today : నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
అంతేకాదు కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని కోర్టులో వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో 4వ తేదీతో వాదనలు ముగిశాయి. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా తీర్పును రిజర్వ్‌లో ఉంచి తీర్పును నేటికి వాయిదా వేశారు. కాగా, కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈరోజు కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో తీహార్ జైలు నుంచి మళ్లీ రేపు (మంగళవారం) ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.
Read also: Kurnool Crime: ప్రేమ జంట ఆత్మహత్య.. కులాలే ప్రాణం తీశాయి..!
గత నెల 15న హైదరాబాద్‌లో కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. 16న ఆమె ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. మొదటిసారి ఏడు రోజులు, రెండోసారి మూడు రోజులు.. కోర్టు అనుమతితో మొత్తం 10 రోజుల పాటు ఆమెను కస్టడీలోకి తీసుకున్న ఈడీ. ఆమెను గత నెల 26న తిహాద్ జైలుకు తరలించారు. తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉన్నందున మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 4న విచారణ జరిగిన విషయం తెలిసిందే.
Pemmasani Chandrashekar: విజయమే లక్ష్యంగా పనిచేయాలి.. కార్యకర్తలకు పెమ్మసాని దిశానిర్ధేశం