Leading News Portal in Telugu

Jaggareddy: పీసీసీ చీఫ్‌ పదవిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు



Jaggareddy

Jaggareddy: రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కరని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్ షా విధానమని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అవగాహన లేదని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్ ఓ సారి బీజేపీ అంటారని, ఇంకోసారి కాంగ్రెస్ అంటారని.. ఆయన బతుకుదెరువు కోసం సర్వే సంస్థను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని పీకే చెప్పారని.. కానీ కాంగ్రెస్ గెలిచిందన్నారు.

Read Also: Political Panchangam: ఏ పార్టీ పంచాంగం వారిదే.. రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే?

పీసీసీ చీఫ్‌ పదవిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పదవి తాను కోరుకోవడం కొత్త కాదు.. అడగడం తప్పు కాదని ఆయన వ్యాఖ్యానించారు. పీసీసీ మార్పుకు కొంత సమయం ఉందని.. తొందర లేదని మీడియాతో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి కదా అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు. తాను బస్టాండ్‌లో ఉంటానని, ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు ఎక్కుతా అంటూ పీసీసీ పదవిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పీసీసీ, సీఎం ఒక్కరే అయి ఉంటే బాగుంటుందని అలా కొనసాగుతున్నారని పేర్కొన్నారు.

Read Also: Komatireddy Venkat Reddy: ప్రజాప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు రానివ్వం..

మందకృష్ణ మాదిగ బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడుతున్నాడని.. తటస్థంగా ఉండి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తామన్నారు. బీజేపీ బౌండరీలో ఉండి మంద కృష్ణ మాట్లాడితే.. రాజకీయ మాటలే వస్తాయన్నారు. బీజేపీని తెలంగాణలో మాదిగ ను రాజ్యసభ సభ్యుడిని చేయమని ఆడిగావా..? కేంద్ర మంత్రి చేయాలని డిమాండ్ అయినా చేశావా..? అంటూ మందకృష్ణను ఉద్దేశించి ప్రశ్నించారు. బంగారు లక్ష్మణ్‌ని నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించారా అంటూ అడిగారు. మీరా కుమార్‌ను స్పీకర్ చేసింది కాంగ్రెస్ కాదా అంటా ప్రశ్నించారు.