
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తుక్కుగూడ సభలో రాహూల్ గాంధీ నోటి చేత పచ్చి అబద్ధాలు మాట్లాడించారన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాపం రాహుల్ గాంధీకి ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చెప్పితే అది మాట్లాడి పోయాడని, బీఆర్ఎస్ హయంలోనే 503 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం….. వీటికీ మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. నిరుద్యోగులు ఇవ్వన్ని గమనిస్తున్నారని, టెట్ పరీక్ష ఫీజ్ ఏంటనే తగ్గించాలనీ మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. 1500లకు పై చిలుకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి అని గతంలో మాట్లాడారు…. ఇప్పుడెందుకు 560 ఉద్యోగాలు మాత్రమే రిలీజ్ చేశారో చెప్పాలన్నారు బాల్కసుమన్.
అంతేకాకుండా..’మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకునట్లు 30 వేల ఉద్యోగాలు మేము ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు డమ్మీ అభ్యర్థులే. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు … కిషన్ రెడ్డి గెలుపు కోసం దానం నాగేందర్ ను మా పార్టీ నుండి తీసుకోని ప్రకటించాడు. మోడీ బడే బాయ్….రేవంత్ రెడ్డి చోటే బాయ్. మోడీ చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో డమ్మీ అభ్యర్థులను ప్రకటించారు. కొడంగల్ పోయి ముసలి కన్నీరు కారుస్తున్నడు రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు ….. ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ బిజెపి ఒక్కటే. రెండు పార్టీల కంటే బిఆర్ఎస్ పార్టీనే బలమైన పార్టి అందుకే మా పార్టీ నాయకులను, కాంగ్రెస్ , బిజెపి పార్టీలు తీసుకుని అభ్యర్థులగా పెట్టుకున్నారు.’ అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.