Leading News Portal in Telugu

NV Subhash BJP : కాంగ్రెస్ పార్టీ 543 స్థానాల్లో సగం సీట్లలో కూడా పోటీ చేయడం లేదు



Nv Subhash Bjp

గాంధీ భవన్‌లో జరిగిన పంచాంగ శ్రవణంలో 350 నుంచి 4వందల స్థానాలు కైవసం చేసుకుని మూడోసారి ప్రధాని అవుతారని పంచాంగ కర్తలు స్పష్టం చేశారని, కాంగ్రెస్ పార్టీ 543 స్థానాల్లో సగం సీట్లలో కూడా పోటీ చేయడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ.సుభాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగతా సీట్లను మిత్రపక్షాలను కట్టబెట్టిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లా అవుతారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు వస్తుందని, ప్రకృతి కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు కష్టాలు, కరువు, ఆత్మహత్యలు అని సుభాష్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా తయారైందన్నారు.

అంతేకాకుండా.. ‘రోజుకొక్క ఎమ్మెల్యేను చేర్చుకుంటూ డ్రామాలు ఆడుతుంది. కాంగ్రెస్, మజ్లీస్ ములాఖాత్ అయ్యాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే దాని పంచన మజ్లిస్ చేరుతుంది. 74మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎట్లా కూలుతుంది. రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని కూలూస్తారని ఆభద్రత భావం ఉంది. కాంగ్రెస్, brs కూడా ఒక్కటే.. BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అవినీతి,కుంభకోణాలు చేసిన brs ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఇంటి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వ భూమి అని బోర్డు ఉంటే… కాంగ్రెస్ లో చేరాక దానం నాగేందర్ ప్రాపర్టీ బోర్డు పెట్టారు. ఎంపీ సీట్లు తక్కువ వస్తే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారు కాబట్టి.. బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నల్గొండ , ఖమ్మం గ్యాంగ్ లు రెడీ గా ఉన్నాయని అయన భయ పడుతున్నారు.’ అని సుభాష్ అన్నారు.