Leading News Portal in Telugu

BV Raghavulu: కేంద్రంపై నిప్పులు చెరిగిన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు..!



16

సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు తాజాగా మీడియా పూర్వకంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాపితంగా సీపీఎం పార్టీ వ్యవహరించాల్సిన తీరు పై సమీక్ష చేసుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసామని ఆయన చెప్పారు. ఇకపోతే ఈ సమావేశంలో 70 ఏళ్లుగా సమకూర్చుకున్న దేశ సంపదను మోడీ కొల్లగొట్టారని.. 10 ఏళ్ళ పాలనలో బీజేపి దేశాన్ని ధ్వంసం చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కూటమికి 400 స్థానాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని.. అందుకు కార్పొరేటర్ మీడియా కూడా కోడై కూస్తున్నాయని ఆయన వాపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ ప్రచారం బ్లఫ్. వట్టి ప్రచారం మాత్రమే.. అందులో ఏమాత్రం నిజం లేదని.. అంత నమ్మకం వారిపైనే వారికే ఉంటే కొందరిపై అక్రమ కేసులు ఎలా పెట్టి జైల్ కు పంపుతున్నారని ఆయన ప్రశ్నించారు.

Also Read: Ganja Selling: వేములవాడలో గంజాయి కలకలం.. 5 గురు అరెస్ట్.. 10 మంది పరారీ..!

జార్ఖండ్ ముఖ్యమంత్రి సొరేన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎలా అరెస్ట్ చేస్తారని.. ఈడీ ని మోడీ వాడుకుంటున్నాడు., ఎన్నికల సమయంలోనే ఎందుకు అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే వారి చేసిన తప్పులు గుర్తొచ్చాయా అంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏలోక్ట్రోల బాండ్స్ ద్వారా 7000 కోట్లు బీజేపీ వాళ్ళు సమీకరించారు. ఈ పార్టీ ఆపార్టీ అని కాకుండా అన్ని పార్టీల ముఖ్య నేతలను అరెస్ట్ చేస్తున్నారు. 17 వందల కోట్ల పెనాల్టీ కాంగ్రెస్ పార్టీకి వేశారు. ఈ వ్యవహారం చూస్తుంటే బీజేపీ అభద్రతా భావంలోకి వెళ్ళిందని స్పష్టనగా అర్ధం అవుతుంది. పార్టీల మార్పు కోసమే ఈ తతంగం అంతా కూడా అని.. 400 సీట్లు వచ్చే సీనే ఉంటే చేరికలు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు.

Also Read: Jeevan Reddy: రాష్ట్రప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..!

తప్పు చేస్తే కవిత, కేజ్రీవాల్ ఎవైరినైన అరెస్ట్ చేయొచ్చు., ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ ఎంపీ కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు. ఆయన ఇపుడు ఎన్డీయే కూటమిలో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయరా అని ప్రశ్నించారు. బీజేపీ కక్కుర్తి పడుతుంది.. ఏలక్ట్రోరాల్ బాండ్స్ తీసుకొని పార్టీ ఏదన్నా ఉందంటే అది సీపీఎం పార్టీ మాత్రమే. 14 వేల కోట్లు కాంగ్రెస్,12 వేల కోట్లు బిఆర్ఎస్ కు అందాయని.. ప్రపంచం లో కెళ్లా అత్యంత అవినీతి ఏలోక్ట్రోరాల్ బాండ్స్ అంటూ అయన విరుచుక పడ్డాడు.