Leading News Portal in Telugu

MLA Shakeel : నా కుమారుడి తప్పు ఉంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటా



Mla Shakeel

నా కుమారుడు రాహిల్‌ను కేసుల్లో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. ఎమ్మెల్యే షకీల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడి తప్పు వుంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానన్నారు. నా కుమారుడు రాహిల్ చేయని తప్పుకు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదన్నారు. దీనిపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలన్నారు షకీల్‌. కేసు ట్రయల్ లో వుందని, నాపై రాజకీయ కక్ష వుంటే నా కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నా కుమారుడు పంజాగుట్ట కేసులో కారు బారికేడ్లకు తగిలితే నా కుమారుడిపై 21 సెక్షన్ల కేసులు పెట్టారని, కేసు పారదర్శకంగా విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్నానని ఆయన అన్నారు.

నా ఆరోగ్యం బాగాలేకపోయినా నాపై ఎఫ్.ఐ.ఆర్ చేశారని, నేను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పని చేశానని, నా కుమారుడిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. నా కొడుకును ఎన్‌కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, నా కుమారుడికి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ ఇతర పోలీస్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. నా కుమారుడు రాహిల్ మానసిక ఒత్తిడికి గురి అయితే హాస్పిటల్ లో చికిత్స తీకుంటున్నారని, ఓ విద్యార్థి పై ఇన్ని కేసులు పెడితే ఏలా అని ఆయన అన్నారు. రాజకీయ నాయకులు ఆలోచించండి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు.