Leading News Portal in Telugu

Pushpa SRH: సన్ రైజర్స్ టీంపై ‘పుష్ప’ టీం ప్రశంసలు.. పోస్ట్ వైరల్..



9

రష్మిక మందన, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమాకి లెక్కలు మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి పార్ట్ నేషనల్ వైడ్ గా ఎంత పాపులారిటీని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు అందులో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు కూడా దక్కడం. దాంతో రాబోయే పుష్ప2 సినిమాపై పెద్ద అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Pulses: తగ్గిన పప్పు దినుసుల ఉత్పత్తి .. 2023-24లో దిగుమతి రెండింతలు

ఈ సినిమా ఆగస్టు 15న సినిమా థియేటర్లోకి రాబోతున్నట్లు ఇదివరకే చిత్ర బృందం తెలిపిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమాకు సంబంధించి ఇదివరకే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలను క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప టీం నుండి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో పుష్ప టీం చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు ఈ పోస్టులో ఏముందో చూస్తే..

Also Read: Amitabh Bachchan: మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్న ‘బిగ్ బీ’..

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ.. మళ్లీ వారే ఆ రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. ఎంత పెద్ద బౌలర్స్ అయినా సరే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ముందర తేలిపోతున్నారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను పుష్ప సినిమాతో పోలుస్తూ.. సినిమా మూవీ టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సీజన్ లో తన రికార్డును తానే బద్దలు కొట్టినట్టు ఈ పోస్టర్ అర్థమవుతుంది.