Leading News Portal in Telugu

MP Laxman: కాంగ్రెస్ 400 స్థానాల్లో గెలిచే అవకాశం లేదని మమతా బెనర్జీ చెబుతుంది..



Laxman

నామినేషన్ల తొలి రోజు తొలిగట్టం పూర్తైంది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. తొలి గట్టంలోనే మహబూబ్ నాగర్, మల్కాజ్ గిరి, మెదక్ నామినేషన్లు పూర్తి చేసుకుంది.. ఈ నామినేషన్ సందర్భంగా జరిగిన ఊరేగింపు చూస్తే ఎన్నికల తరువాత విజయం సాధించిన ఊరేగింపులా ఉంది.. ఇప్పుడు జరిగే ఎన్నిక దేశం కోసం.. ఆ దేశానికి మోడీ ప్రధానిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.. ముస్లిం మహిళలు సైతం మోడీనే ప్రధానిగా కొనసాగాలని కోరుకుంటున్నారు.. అందరూ విభజన రాజకీయాలు చేస్తుంటే.. మోడీ వికసిత భారత్ కార్యక్రమాలు చేపడుతున్నాడు.. ప్రజలు మోడీ ప్రభుత్వ విధానాలపై.. మోడీ అభివృద్ధిపై విమర్శించే రాహుల్ గాంధీకి అవకాశం లేకుండా పోయింది అని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే మోడీ కులాన్ని విమర్శిస్తున్నారు.. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా 23 సంవత్సరాల రాజకీయ చరిత్ర మోడీది.. ఎన్నికల్లో నల్ల ధనానికి స్వస్తి చెప్పడానికి బాండ్లు తీసుకొచ్చి పారదర్శకత చూపించాడు అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Read Also: KCR Hot Comments: 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా..

ఎవరు ఏ ఏ పార్టీ కి ఎంత విరాళాలు ఇస్తున్నారు అని ఈ బండ్లతో తెలిసిపోతుంది అని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. దీని వల్ల ఎన్నికల్లో నల్ల ధనానికి స్వస్తి పాలకొచ్చు.. ఇప్పుడు కాంగ్రెస్ ఎలక్ట్రోల్ బండ్ల విధానాన్ని వ్యతిరేకిస్తే నల్ల ధనాన్ని ప్రోత్సహిస్తున్నారనీ అర్థం అవుతుంది.. బీజేపీ పార్టీ కంటే కూడా ఇతర పార్టీలకే ఎక్కువ శాతం ఎలక్ట్రోల్ బండ్లు ఉన్నాయి.. కానీ ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ తో బీజేపీ బెదిరించి ఎలక్ట్రోల్ బండ్లు సంపాదించింది అని చెప్తున్నారని ఆయన తెలిపారు. ఈవీఎం విషయంలో కూడా ఇష్టం వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా మూడు రాష్ట్రాల్లో గెలుపు సాధించారు.. అంటే కాంగ్రెస్ గెలిచిన రాష్ర్టంలో ఈవీఎం బాగా పని చేస్తున్నాయి.. అదే బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ అని సమాధానం చెప్పాలి.. ఈడీ, మోడీ అని కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు.. 2014కు ముందు కంటే ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఈడీ పట్టుకుంటున్న అక్రమ డబ్బే ఎక్కువ అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు.

Read Also: Spring Season: భారతదేశంలో వసంత కాలం అదృశ్యమవుతోందా..? కారణాలేంటి..?

ఇక, కాంగ్రెస్ వాళ్ల అవినీతి డబ్బు దొరుకుతుంటే తట్టుకోలేక ఈడీ, మోడీ అని మాట్లాడుతున్నారంటూ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే అన్ని హామీలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశం ఉంది అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి.. ఇండియా కూటమిలో ఆన్న మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ 400 స్థానాల్లో పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం లేదని చెబుతుంది.. మరి ఏ రకంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదు లేదు.. రాష్ర్టంలో కూడా హామీలు అమలు చేసే అవకాశం కూడా కనిపించడం లేదు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు గమనించి బీజేపీకి ఓటు వేయాలి.. కవితకు బెయిల్ రాలేదు అంటే తన ప్రమేయం లేదనే ఆధారాలు లేవు.. కవిత సారా వ్యాపారం చేసి తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని నాశనం చేసింది అని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.