
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. నామినేషన్లు ఆన్లైన్ లో కూడా సమర్పించవచ్చు.. నామినేషన్ పత్రాలు ప్రింట్ తీసి 24 ఏప్రిల్ వరకు ఆర్వోకు అందజేయాలన్నారు. జాగ్రత్తగా అఫిడవిట్, నామినేషన్ పత్రాలు పూర్తి చేయాలి.. ఫాం-1లో ప్రదేశం ఎక్కడ రాస్తారో అక్కడి ఆర్వోకి అందజేయాలి.. అదే నియోజకవర్గంకు చెందిన 10 మంది ప్రపోజల్స్ సంతకాలు, వివరాలు ఉండాలన్నారు. ఫా-ఏ, ఫాం-బీపై ఒరిజినల్ సంతకాలు ఉండాలని చెప్పారు. అభ్యర్థులు తాజా పాప్ పోర్ట్ సైజ్ 5 ఫోటోలు జత పర్చాలి.. బ్యాలెట్ పత్రాల్లో తమ ఫోటో సక్రమంగా ముద్రించలేదని గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు.. యూనిఫాంతో ఉన్న, క్యాప్, రంగుల కళ్ళజోడుతో ఉన్న ఫోటోలు చెల్లవు అని తెలిపారు. అభ్యర్థుల క్రిమినల్ కేసుల వివరాలను ప్రసార, ప్రచార మాధ్యమాల్లో ప్రసారం చేయాలి.. అఫిడవిట్ లో ఏ కాలంను ఖాళీగా పెట్టొద్దు.. అందుకు సంబంధించిన వివరాలు రాయాల్సి ఉంటుంది అని వికాస్ రాజ్ వెల్లడించారు.
Read Also: YS Viveka murder case: వైఎస్ వివేకా కేసులో మధ్యంతర ఉత్తర్వులు.. విపక్ష నేతలకు కోర్టు కీలక ఆదేశాలు
నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని ఆర్వోలను ఆదేశించామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. 17 నియోజకవర్గాల్లో 42 మంది 48 నామినేషన్లు దాఖలు చేసారు.. 5, 7048 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి.. 19 ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఎన్నికల విధుల్లో నిమగ్నమైయ్యాయి. ఇప్పటి వరకు 60 కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయి.. మరో 100 కంపెనీల పోలీసు బలగాలు త్వరలో రాష్టానికి వస్తాయి.. వివిధ రాష్ట్రాల నుంచి 12 వేల మంది పోలీసులు బందోబస్తు కోసం వచ్చారు.. మరో 16 వేల మంది త్వరలో రాష్ట్రానికి వస్తారని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.