Leading News Portal in Telugu

Jagga Reddy : ఈటల రాజకీయ జీవితం.. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నది



Jaggareddy

ఈటల రాజేందర్ రాజకీయ జీవితం.. రాహుల్ గాంధీ నాయకత్వం ముందు చాలా చిన్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చరిత్ర.. రాజకీయం మీద బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, ఆయన ముందు వీళ్లంతా చిన్న వ్యక్తులు అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులకు స్పష్టంగా చెబుతున్నానని, దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోడీ చుట్టే తిరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ గురించి కానీ .. మోడీ గురించి చెప్పాల్సిన అవసరం ఉందని, మోడీ ప్రధాని కాకముందు.. అద్వానీ రథయాత్ర ప్రారంభ సమయంలో ఆయన వెనక ఉండి సర్వీస్ చేసే వాడు.. మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కి మోడీ కి చాలా వ్యత్యాసం ఉందని, అద్వానీ రథయాత్ర కి ముందు దేశానికి .. గుజరాత్ కి మోడీ ఎవరో కూడా తెలియదన్నారు జగ్గారెడ్డి.

అంతేకాకుండా.. ‘అద్వానీ రథయాత్ర పూర్తి అయ్యాక.. గుజరాత్ ఎన్నికలల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోడీ గెలిచిన తర్వాత అద్వానీ సిల్డ్ కవర్ లో సీఎం గా ప్రకటించారు. మోడీ సీల్డ్ కవర్ గుజరాత్ సీఎం. బీజేపీ నేతలు మోడీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా.. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్ లో డిసైడ్ చేశారు.. సీఎం లను డిసైడ్ చేసే రాహుల్ గాంధీ కి.. సీల్డ్ కవర్ సీఎం మోడీ కి చాలా తేడా ఉంది. మోడీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలి. రాహుల్ గాంధీ ప్రజల కోసం పోరాడే ఫైటర్.. మోడీ పవర్ కోసం వచ్చిన లీడర్. అధికారం లో నుంచి వచ్చిన లీడర్ మోడీ.. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ. పేదల కోసం రాముడు పాలన చేశారు.. గుడి నిర్మాణం చేస్తే రాముడు సంతోషిస్తా.. అనలేదు రాముడు.

కిషన్ రెడ్డి.. ఈటెల.. సంజయ్ లు రాజకీయంగా బతకాలి అంటే.. జై శ్రీరామ్ అనకతప్పదు. రామాలయ నిర్మాణం తో సమస్యలు పోయాయా.. శ్రీరామ చంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే. రాముడి ఆదర్శాలను నిలబెట్టే వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే.. సీట్ల కేటాయింపుల తో సమస్యలు పోవు.. కొందరికి సీట్ల విషయంలో అన్యాయం జరగవచ్చు.. కానీ అది ఒక్కరి సమస్య.. అధికారంలో ఎన్ని ఏళ్లు ఉన్నమనేది.. కాదు.. ప్రజలు ఎంత తుప్తి తో జీవిస్తున్నారు అనేది రామ రాజ్యం. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో.. 56 లక్షల కోట్లు అప్పు ఉంటే.. పదేళ్ళలో మోడీ పాలనలో అప్పులు డబుల్ అయ్యాయి.. మోడీ కి రాముడు అప్పులు చేయమని చెప్పాడా.. ఏ గ్రంథంలో అప్పులు చేయమని ఉంది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.