
Raghunandan Rao: రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేనని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మోడీ పాలన చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ సర్వేలు చూసిన మోడీ మూడోసారి ప్రధాని అవుతారని వస్తున్నాయన్నారు. ఇంకొన్ని అంశాలు మిగిలి పోయాయి కాబట్టి 400 సీట్లు లక్ష్యంగా ముందుకి వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాలు మోడీ అమలు చేస్తున్నారని తెలిపారు. బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించి పారదర్శకత పెంచామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఉపాధి హామీ కూలీ డబ్బులు నేరుగా లబ్ది దారుడి అకౌంట్ లో వేసిన ఘనత మోడీ కి దక్కుతుందన్నారు.
కూరగాయలు అమ్మే వారు కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ కి హామీలు ఇచ్చి మర్చిపోవడం అలవాటే అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా హామీలు పెట్టిందన్నారు. పోలవరంకు ఆరోజే జాతీయ హోదా ఇవ్వాల్సిందన్నారు. ఒక్క రాష్ట్రంలో ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చి రెండవ రాష్ట్రానికి ఇవ్వకపోవడం ఎంటి? అని ప్రశ్నించారు. హామీలు ఇవ్వడం కాంగ్రెస్ వంతు అమలు చేయడం మా వంతు అన్నారు. 1980లో మెదక్ కి రైల్ ఇస్తానని ఇందిరా గాంధీ హామీ ఇచ్చిందన్నారు. కానీ మా హయాంలో మెదక్ కి రైల్ తెచ్చామన్నారు. నిన్న సీఎం ఏదంటే అదే మాట్లాడి వెళ్ళారన్నారు.
నేను దుబ్బాకకి ఏమి చేశానో ఒక పుస్తకం తయారు చేసి.. మా నియోజక వర్గంలో 75 వేల మందికి పంపిణీ ఇస్తానని అన్నారు. మీరు ఎప్పుడూ వచ్చిన సరే.. మా గడిని మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని తెలిపారు. దుబ్బాక అబివృద్ధి పై మీరెప్పుడు వచ్చిన నేను రెఢీ అని సవాల్ విసిరారు. కావాలంటే బస్సు ఖర్చులు కూడా నేనే ఇస్తానని తెలిపారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావు మెదక్ లో పనికి వస్తారా ? అని హరీష్ రావు, రేవంత్ మాట్లాడుతున్నారు.. కామారెడ్డి లో ఓడిపోయిన కేసిఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర ఎలా చేపడతారు ? 2018 లో కొడంగల్ లో ఓడిన రేవంత్ మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయలేదా! అని ప్రశ్నించారు.
నేను నా గడి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని, ఎవరు పేరు మీద రాయమంటే రాసి ఇస్తానని తెలిపారు. మా గడినీ చూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బీసీ గురించి మాట్లాడుతున్నారు.. మీ కేబినెట్ లో బీసీ లు ఎంత మంది ఉన్నారు ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా? గెలిచిన ఆ ముదిరాజు బిడ్డకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. నేనుకూడా ఉద్యమాలు చేసి వచ్చానని తెలిపారు. నిన్ను ఏమన్నా నేను సమాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు. నేను కూడా కొడంగల్ వచ్చి బీ మీద మాట్లడగలనని తెలిపారు.
దుబ్బాక ఎంత దూరమో కొడంగల్ కూడా అంతే దూరంగా అది సీఎం రేవంత్ మర్చిపోవద్దన్నారు. నిన్న మరో రెండు వేల కోట్లు అప్పు తెచ్చుకున్నారని తెలిపారు. అప్పు తీసుకుంటే తప్ప మీకు డిసీల్ కూడా రాదన్నారు. రేవంత్ లా డ్యుయల్ రోల్ చేయలేనని తెలిపారు. కేరళ కి వెళ్లి రేవంత్ కమ్యూనిస్టులను తిట్టి వస్తారని తెలిపారు. అదే సమయంలో ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కమ్యూనిస్టు లతో చర్చలు జరుపుతారన్నారు.
ఇంతకీ మేము ఎవరీ మాట నమ్మాలి? ప్రజల్ని కాపాడాల్సిన సీఎం కన్నీరు పెట్టుకుంటే ఎలా ? అని ప్రశ్నించారు. రేవంత్ కి భవిష్యత్తు బాగా కనిపిస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ కి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి డబుల్ డిజిట్ వస్తె తెలంగాణలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో రేవంత్ కి బాగా తెలుసన్నారు. అందుకే సానుభూతి కోసం అలా మాట్లాడుతున్నారని కీలక వ్యాఖ్యు చేశారు.
Top Headlines @ 1PM: టాప్ న్యూస్