
Shabbir Ali: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. రైతులు, కౌలు రైతుల అధైర్యపడవద్దని సూచించారు. రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామన్నారు. నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయించి వారి వివరాలు సేకరించారన్నారు. ఎన్నికల తర్వాత బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని అధికారులకు ఆదేశించారు. వర్షానికి కొట్టుకపోయిన ధాన్యానికి అంచనా వేసి దానికి కూడా ప్రత్యేక నిధుల ద్వారా నష్టపరిహారం అందిస్తామన్నారు.
Read also: Kakarla Suresh: కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలు అని కొట్టిపారేశారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల మధ్యలో డ్రాప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని.. అందుకే కేసీఆర్ భయపడి ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమని షబ్బీర్ అలీ అన్నారు. రేవంత్ రెడ్డితో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని తెలిపారు. జైలులో కేసీఆర్ కు డబుల్ రూమ్ కట్టించారని.. కుటుంబ సభ్యులందరినీ అదే జైలులో ఉంచుతామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి పరిహారం అందలేదన్నారు షబ్బీర్ అలీ.
Agni Keli Tradition : కాల్చిన తాటి ఆకులతో యుద్ధం.. ఎక్కడో తెలుసా ?