
Telangana Youth Congress: ఉప్పల్ క్రికెట్ స్టేడియం ను ముట్టడిస్తామని సాట్ చైర్మన్.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలకు నిరసనగా ఉప్పల్ స్టేడియంను ముట్టడిస్తామని తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నదని ఆరోపించారు. అక్షర స్కూల్ యాజమాన్యం టికెట్స్ కు అక్రమంగా అమ్మకాలు చేస్తుందని మండిపడ్డారు. క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశలకు గురి చేసిందన్నారు. హెచ్.సి.ఏ వైఖరి నిరసిస్తూ రేపు ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేన రెడ్డి తెలిపారు.
Read also: Rishabh Pant: అతడిపై నమ్మకం ఉంచాం.. ప్లాన్ వర్కౌట్ అయింది: పంత్
ఇవాళ ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ ముట్టడించనున్న ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియం శివసేన రెడ్డి చేరుకోనున్నారు. అనంతరం ఉప్పల్ స్టేడియంను ముట్టడించనున్నాట్లు తెలిపారు. యూత్ కాంగ్రెస్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్డేడియం వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. ఎటువంటి సంఘటన చోటుచేసుకోకుండా భారీగా పహారా కాస్తున్నారు. అడుగడుగున పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు బారులు తీరారు.
Read also: CM Revanth Reddy: నేడు చేవెళ్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
కాగా.. ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 7 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లలో గెలిచింది. ఆర్‌సీబీపై గెలిచి ప్లే ఆఫ్‌కు మరింత చేరువ కావాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది. మరోవైపు ఆర్‌సీబీ ఆడిన 8 మ్యాచ్‌లలో ఒకటే గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా దూరం చేసుకుంది. వరుస ఓటములతో సతమతం అవుతున్న ఆర్‌సీబీ.. జోరుమీద సన్‌రైజర్స్‌ను ఆపగలదా? అన్నది చూడాలి.
Delhi: ఇండియా గేట్ వద్ద ఐస్ క్రీం విక్రేత దారుణ హత్య.. నిందితుడు అరెస్ట్