Leading News Portal in Telugu

CM KCR : ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది



Kcr

పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే పోరాడి తెలంగాణ సాధించా తెలంగాణ కోసం పోరాడితే ఖమ్మం జైల్ లో వేశారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలో కి కాంగ్రెస్ అని ఆయన అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలే నేను వచ్చినంక ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చానని, రైతులకు నేటికీ రైతు బంధు రాలేదు, రెండు లక్షల రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి జాడనే లేదన్నారు. ఐదు ఎకరాల లోపు రైతులకే రైతు బంద్ అంట ఆపై భూమి ఉన్న రైతుల సంగతి ఏంటి అని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి కరెంటు లేక 225 మంది రైతులు సచ్చిపోయారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. మీ ఓటు ద్వారా ధర్మాన్ని గెలిపించండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ ఆశీర్వదించండి. ప్రవీణ్ కుమార్ అల్లాటప్పా నాయకుడు కాదు. చదువుకున్న మేధావి. మోడీ మోటార్రకు మీటర్లు పెట్టాలని చెప్పాడు, నా తల తెగిన పెట్టాను అని చెప్పా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష వ్యాస బాగాలేదు ఇష్టం వచ్చిన దిగజారుడు పదజాలం వాడుతున్నాడు ఇది పద్ధతి కాదు. బీజేపీ కి ఓటు వేస్తే మళ్ళీ మీటర్లు పెడుతడు.’ అని కేసీఆర్‌ అన్నారు.