Leading News Portal in Telugu

KP Vivekananda : సీఎం రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్దాల పునాదుల మీద మొదలైంది



Mla Vivekananda

సీఎం రేవంత్ రాజకీయ ప్రస్థానమే అబద్దాల పునాదుల మీద మొదలైందని ఎమ్మెల్యే కె .పి .వివేకానంద ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ ను రేవంత్ స్వీకరించలేకపోతున్నారని, అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు రాకపోతే తన సీటు కు ఎసరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారని, అందుకే దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నారని ఆయన విమర్శించారు. విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళే తడి బట్టల్తో గుడుల లోకి వెళ్తారని, రుణమాఫీ ,గ్యారంటీ ల పై దేవుళ్ళ మీద ఒట్లు కాదు చేయక పోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని మా సీనియర్ నేత హరీష్ రావు సవాల్ విసిరారన్నారు.

MLC Election: నల్లగొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎన్నికలో గెలుపెవరిది..?

హరీష్ రావు సవాల్ పై నేరు గా స్పందించకుండా రేవంత్ మాటల గారడీ తో ప్రజలను మభ్య పెడుతున్నారని, హరీష్ రావు ఉద్యమ ప్రారంభం నుంచి కేసీఆర్ కుడి భుజం గా ఉన్నారని ఆయన విమర్శించారు. ప్రతి ఎన్నికలో భారీ మెజారిటీ తో గెలుస్తారని, హరీష్ రావు అంటే ప్రజల్లో ఓ నమ్మకం ఉందన్నారు కేపీ వివేకానంద. ఆయన రాజీనామా సవాల్ ను ప్రజలు నమ్ముతున్నారని, నిజంగా రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటె తన రాజీనామా పత్రాన్ని తన కిష్టమైన వ్యక్తి దగ్గర రాజీనామా పత్రాన్ని పెట్టాలన్నారు కేపీ వివేకానంద.

బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు.. నిర్మాతపై హీరోయిన్ సంచలన ఆరోపణలు