
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. గడపగడపకు వెళ్లి తమకు ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సనత్ నగర్లో పాదయాత్ర మొదలు పెట్టారు. పద్మారావు గౌడ్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పద్మారావు గౌడ్కు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజానీకం జన నీరాజనం పలికారు.
Read Also: Bomb threats: జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు..
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. సనత్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ని గత ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ముఖ్యంగా సనత్ నగర్లో రోడ్లు, డ్రైనేజీ, పార్క్ లు మంచిగా అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించేందుకు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజానీకం సిద్ధం అయ్యారని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలరని పద్మారావు గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Also: Google layoffs: మరోసారి భారీగా ఉద్యోగులను తొలగించిన గూగుల్…