Leading News Portal in Telugu

King Fisher Beers: లైట్ బీర్ల పొరాటంలో విజయం.. సన్మానించిన మందుబాబులు



King Fisher Beers

King Fisher Beers: లైట్ బీర్ల పొరాటంలో విజయం సాధించాడు తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు. మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ బీర్ల కోసం చేసిన పోరాటంలో విజయం సాధించారు. మంచిర్యాలలోని పలు వైన్ షాప్‌లలో, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న(సోమవారం) జిల్లా ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే తమకు బీర్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని లెటర్ ప్యాడ్ మీద రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన అధికారులు తెల్లారేసరికి వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచారు. పలు వైన్స్, బార్లు తిరుగుతున్న తరుణ్‌ను మందుబాబులు అభినందించి శాలువాతో సన్మానించారు. 24 గంటల్లో తమ డిమాండ్ ను నెరవేర్చడంతో తాగుబోతుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

Read Also: Mulugu: ములుగు జిల్లాలో విషాదం.. నదిలో మునిగి బాలిక మృతి