
కాంగ్రెస్ పార్టీ స్కాంల మీదగా నడిచే పార్టీ అని విమర్శించారు బీజేపీఎల్పీ మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పథకాల పైన నడిచే పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. 100 రోజుల్లో అరు పథకాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక పథకంమైన అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మోసం చేసి గద్దె నెక్కిన నాయకుడు రేవంత్ అని, ఎన్నికల్లో ప్రజలకు పథకాల ఇస్తామని ఓట్లు దండుకున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పై వ్యతిరేకంగా పోరాటం చేసి రైతులకు అండగా ఉంటామన్నారు మహేశ్వర్ రెడ్డి. ఇచ్చిన మాటలకు కట్టుబడే ఉండే పార్టీ బీజేపీ పార్టీ అని, కేంద్రంలో మూడవ సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరం.. – భైంసా లో జరిగిన కుభీర్, భైంసా మండలాల కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, కాని మహిళా రిజర్వేషన్ తో పాటు ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం EWS రిజర్వేషన్ ను అమలు పరిచిన ఘన చరిత్ర బీజేపీ పార్టీదే అన్నారు మహేశ్వర్ రెడ్డి. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో, ఈ నెల 24న విడులైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు అభినందనలు తెలిపారు. టెన్త్ ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా అత్యధికంగా 99.05 శాతం సాధించి ప్రధమ స్ధానంలో నిలవడం హర్షణీయమన్నారు. ఈ అద్భత విజయాన్ని సాధించిన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందనీయులు తెలిపారు. కాంగ్రెసు పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో, అభయ హస్తంలో విద్యా జ్యోతుల పధకం కింద ఇంటర్మీడియట్ పాసయిన ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్సుకు 15 వేల రూపాయలు, పదవ తరగతి ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఇచ్చిన హామీ మేరకు ఇంటర్మీడియట్, టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.15 వేలు, రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. త్వరలోనే వివిధ యూనివర్శిటీల డిగ్రీ, పీజీ పరీక్షల ఫలితాలు కూడా వెలువడనున్నాయని, విద్యా జ్యోతుల పధకం కింద డిగ్రీ పూర్తి చేస్తే రూ.25 వేలు, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు అందజేస్తామన్న హామీని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.