
Akbaruddin Owaisi: హైదరాబాద్ లో రజాకార్ల పరిపాలన కొనసాగుతుందని అమిత్ షా మాటలకు అక్బరుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో ఎవరు స్వేచ్ఛగా జీవిస్తున్నారు అందరికీ తెలుసన్నారు. ఎలక్ట్రోల్ బాండ్స్ పేరుతో అతిపెద్ద స్కీమ్ కి బీజేపీ పాల్పడిందన్నారు. రూ.6000 కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్లను బీజేపీ తీసుకుందన్నారు. బీజేపీ పార్టీ ఒక చిన్న సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్లేదన్నారు.
ఎంఐఎం పార్టీకి ఎలాంటి ఎలక్ట్రోల్ బాండ్స్ లేకపోయినా సంక్షేమ పథకాలు చాలా చేశామన్నారు. పాతబస్తీలో ఓవైసీ ఆసుపత్రి నిర్మించి పేదలకు సేవ చేస్తున్నామన్నారు. మహిళల మంగళసూత్రాన్ని లాక్కుంటామన్న దానిపై ఓవైసీ విరచకపడ్డారు. హిందూ మిత్రులు దగ్గర్నుంచి బలవంతంగా ఎవరైనా మంగళసూత్రాన్ని లాక్కోగలుగుతారా? అలాంటి ప్రయత్నం చేస్తే ఎవరైనా బతుకుతారా? మోడీకి అసలు మంగళసూత్రం విలువ తెలుసా? అని అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు.
Read also: Uttarakhand : ఉత్తరాఖండ్ అడవులకు నిప్పు.. 24 గంటల్లో 43 కేసులు, 52 మందిపై కేసు
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో రజాకార్ల ప్రతినిధిని ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి పార్లమెంటుకు రజకుల ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. రజాకార్ల పాలన నుంచి హైదరాబాద్ కు విముక్తి కల్పించాలని, భాజపా అభ్యర్థి మాధవిలతను గెలిపించాలని, మూడోసారి నరేంద్రమోడీ ప్రధాని కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపొందే 400 ఎంపీ సీట్లలో ఒకటి హైదరాబాద్‌కే దక్కాలన్నారు. హైదరాబాద్‌లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఇక్కడి ప్రజలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదన్నారు. హిందువులు, ముస్లింలు ఈసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Astrology: మే 03, శుక్రవారం దినఫలాలు