Leading News Portal in Telugu

Amit Shah Morphing Video: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో మరో సంచలనం..



Amit Shah

Amit Shah Morphing Video: అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోనే ఢిల్లీ పోలీసులు మకాం వేశారు. నిన్నటి నుండి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈరోజు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న వారిని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాత్రంతా విచారించినట్లు సమాచారం. ఫేక్ వీడియో కి సంబంధించిన కంప్యూటర్లు, హార్దిస్కులు, పెన్ డ్రైవ్ లను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పోటీ పడుతున్నారు.

Read also: Delhi : ఢిల్లీలో మరో సారి బాంబు పేలుళ్ల బెదిరింపులు.. ఏకంగా పోలీస్ కమీషనర్ కే

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.. అమిత్ షా ఫేక్ వీడియో తెలంగాణ ఐపీ అడ్రస్ నుంచి పోస్ట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో తెలంగాణకు ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ బృందం మకాం వేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ అయిన ఐదుగురిని ఢిల్లీ సైబర్ సెల్ విచారించనుంది. అయితే, అరెస్టయిన ఐదుగురూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియాతో సంబంధం కలిగి ఉన్నారని కీలక సమాచారం.

Read also: #ARRPD6 : క్రేజీ మూవీ షూటింగ్ షురూ..

కాగా.. మరోవైపు బుధవారం రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది విచారణ అధికారి ఎదుట హాజరై, షా ప్రసంగానికి సంబంధించిన వీడియోను ట్యాంపరింగ్ చేయడంతో పాటు పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ నేతకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ కేసుకు సంబంధించి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 22 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసి గురు, శుక్ర, శనివారాల్లో పోలీసుల ఎదుట హాజరుకావాలని సూచించినట్లు సమాచారం. ఉంది. మతం ప్రాతిపదికన ముస్లింల కోటాను అంతం చేయాలనే తన నిబద్ధత గురించి ఫేక్ వీడియోలో షా ప్రకటన మాట్లాడుతుంది, అయితే డాక్టర్ మరియు సర్క్యులేట్ చేయబడిన నకిలీ వీడియోను చూస్తుంటే, షా అన్ని రకాల రిజర్వేషన్లను ముగించడం గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.
Nitish Reddy: గెలుస్తామని అస్సలు అనుకోలేదు.. సూపర్‌ ఓవర్‌ ఆడుతామనుకున్నా: నితీశ్ రెడ్డి