Leading News Portal in Telugu

T. Congress: కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం..



Telangana Congress

కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీ. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు.. నిన్న పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇస్తూ.. రోహిత్ దళితుడే కాదని చెబుతోందని పేర్కొన్నారు. మనకులాల గురించి మనమే ఆలోచన చేయాలన్నారు. సిరిసిల్లలో ఏమైంది.. నేరెళ్ల ఘటనకు కారకులు ఎవరని ప్రశ్నించారు. రోహిత్ వేముల స్కాలర్ షిప్ రద్దు కావడం, కుల వివక్షతతోనే రోహిత్ చనిపోయారని తెలిపారు. రోహిత్ దళితుడు కాదని పోలీసులు కుల సర్టిఫికేషన్ ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. శ్రీకాంతాచారి తల్లిని కూడా కేసీఆర్ అవమానిచ్చారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ , ఓబీసీలు సంఘటితం కావాలని పేర్కొన్నారు.

Burning alive: బయటకు వెళ్లిన దళిత బాలికకు నిప్పు పెట్టి సజీవ దహనం..

మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాజ్యాంగాన్ని రాయాలంటే సమర్థులైన అంబేద్కర్ కి బాధ్యత అప్పగించిందని తెలిపారు. అలాంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ హయాంలో పంజాగుట్ట చౌరస్తాలో రాజశేఖర్ విగ్రహం పక్కన.. అంబేద్కర్ విగ్రహాన్ని దళిత కాంగ్రెస్ పెడితే తొలగించారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే జనగణన చేసి రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ గాంధీ ధైర్యంగా చెప్పాడన్నారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తే, మోడీ తనకి ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని మార్చుకుంటాడని తెలిపారు.

Pawan Kalyan: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. మరోసారి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చడంతో పాటు రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు పోతాయని పేర్కొ్న్నారు. మోడీ కుట్రలను సీఎం రేవంత్ ఛేదించాడు.. మోడీకి భయం పట్టుకుందని అన్నారు. సమానత్వం ఉండాలంటే రిజర్వేషన్లు ఉండాలి.. అగ్రకులంలో పుట్టినా నేను.. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.