
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొని.. అక్కడ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మహబుబాబాద్ జిల్లా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పై ప్రజల ఆశీస్సులుండాలని తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ, రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చిన పార్టీ బీజేపీ అని అన్నారు. సీతారాం నాయక్ పనితీరు మీకు తెలుసు.. ఆదివాసీ, గిరిజన ప్రజలకు అండగా ఉంటాడన్నారు.
Read Also: Chennai: చెన్నైలో దారుణం.. 5 ఏళ్ల చిన్నారిపై కుక్కల దాడి.. పరిస్థితి సీరియస్
నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతుందని పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. దేశాన్ని డిజిటల్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడే దేశంగా నిలిపారని అభివర్ణించారు. మరోవైపు.. రిజర్వేషన్ల పై బీజేపీ పై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల పార్టీ.. మోడీ వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణ మాఫీతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదని ఆరోపించారు. మోసపూరిత హామిలిచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.
Read Also: Anna Rambabu: జగనన్న మళ్లీ సీఎం అయితేనే మంచి జరుగుతుంది..