Leading News Portal in Telugu

PM Modi: రేపు వేములవాడలో మోడీ పర్యటన.. 1200 మందితో భారీ భద్రత..



Pm Modi

PM Modi: లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఈనేపథ్యంలో.. రేపు వేములవాడలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మద్దతుగా ప్రధానమంత్రి మోడీ వేములవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం రోజున ఉదయం 8 గంటలకు రాజన్నను మోడీ దర్శించుకోనున్నారు. ఉదయం 9 గంటలకు వేములవాడ శివారులోని బాలనగర్ వద్ద బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొంటారు. వేములవాడ రాజన్నను దర్శించుకునే తొలి ప్రధాని మోడీగా నిలిచారు. గుడి చెరువులో హెలిపాడ్ ను అధికారులు సిద్ధం చేశారు. 1200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు పోలీసులు చేస్తున్నారు.

Read also: Faima : జబర్దస్త్ షో ఫుడ్ గురించి ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మోడీ రానున్న నేపథ్యంలో వేములవాడ పట్టణం కేంద్ర భద్రత సిబ్బంది చేతుల్లోకి వెళ్లింది. మోడీ వెళ్ళే రహదారిలో వెళ్లే ఇంటి నెంబర్లు, ఇంట్లో వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఈరెండు రోజులపాటు డ్రోన్లు కూడా పోలీసులు నిషేధించారు. ఖిలావరంగల్ మండలం లక్ష్మీపురంలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. గతంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్‌లో పర్యటించగా, తాజాగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని హోదాలో ఉన్న నేత వరంగల్ కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Lok Sabha Elections 2024: మూడో దశ ఓటింగ్ లో ఆద్మీ-కాంగ్రెస్ పొత్తు కలిసొచ్చేనా..?