Leading News Portal in Telugu

Viral Video: ఇలాంటి పూలను పెట్టుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో ఉన్నట్లే..



Flowers In Copper Sulfate

ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ప్రజలు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇకపోతే టెక్నాలజీ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతున్న.. కొన్ని రకాలుగా మాత్రం అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ టెక్నాలజీ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ముఖ్యంగా సైన్స్ రంగంలో అనేక మార్పులు సంభవించాయి. మరి ముఖ్యంగా రసాయనక చర్యలకు సంబంధించిన అనేక కొత్త ఫార్ములాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని మంచి ప్రయోజనాలు జరుగుతుంటే., మరికొన్ని అనరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Mumbai: ఇండియాకు పాకిన పాలస్తీనా నినాదం.. స్కూల్ ప్రిన్సిపాల్ తొలగింపు

మామూలుగా రైతుల పండించే కూరగాయలు, పండ్లు, పూలు, ఇలా ఏ పదార్థాలైనా సరే ప్రస్తుతం రసాయనిక ఎరువులు వాడి వాటిని పెంచుతున్నారు. మార్కెట్లో వివిధ రకాల రసాయనికాలు కలిపిన ఎన్నో ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఇలా ఎన్నో రకాల రసాయనక సమ్మేళనం సంబంధించిన ఎరువులను వాడి తినే ఆహార పదార్థాలు, పూలు, పండ్లను పండిస్తున్నారు. ఇలా పండించిన వాటిని చెట్టు నుండి తీసుకున్న తర్వాత కూడా మరోసారి నేరుగా రసాయనాలలో ముంచి మనకి అమ్ముతున్నారు వ్యాపారస్తులు.

Also Read: AP PGECET 2024: అలర్ట్.. ఏపీ పీజీఈసెట్ దరఖాస్తులో తప్పులు చేసారా.. సవరణలకు అవకాశం..

అవునండి.. మీరు విన్నది నిజమే. ఆకుకూరలు, పండ్లు, పూలు ఇలా అనేక వాటిని “కాపర్ సల్ఫేట్ ” అనే రసాయనక మిశ్రమం వాడి ప్రజలకు అమ్ముతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు వ్యక్తులు మల్లెపూల సంబంధించిన దండలను కాపర్ సల్ఫేట్ కల్పిన నీటిలో ముంచి ఆ పూలను మరో ట్రేలో ఉంచుతున్నారు. ఇలా చేయడం ద్వారా పూలు చాలా సేపు వరకు ఫ్రెష్ గా కనబడతాయి. అంతేకాదు వీటిని కొని మహిళలు ధరించిన సమయంలో వారికి అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఒక్కోసారి వీటి వల్ల చర్మ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోని వారవుతారు. లేకపోతే అనవసరంగా ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతూ మరికొన్ని డబ్బులను వృధా చేసుకోవాల్సిందే.