Leading News Portal in Telugu

Kishan Reddy: సికింద్రాబాద్, అంబర్ పేట లో కిషన్‌ రెడ్డి పర్యటన.. షెడ్యూల్‌ ఇదీ..



Kishan Reddy

Kishan Reddy: ఈ నెల13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్​ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్​ ఎంపీగా తనను ఆశీర్వదించాలని, దేశంకోసం మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్, అంబర్ పేట్ నియోజకవర్గంలో కిషన్​ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాల ఉదయం సికింద్రాబాద్ నియోజకవర్గంలో సాయంత్రం అంబర్ పేట్ లో పర్యటించనున్నారు. ఉదయం 9:20 గంటలకు లాలాపేట్ జ్యోతిరావు పూలే స్టాచు నుంచి కిషన్ రెడ్డి పర్యటన మొదలుకానుంది.

Read also: KCR: నేడు కరీంనగర్‌లో కేసీఆర్‌ రోడ్‌ షో.. తెలంగాణచౌక్‌ వరకు ర్యాలీ

అక్కడి నుంచి శాంతినగర్, టీచర్స్ కాలనీ, విజయపురి కాలనీ, తార్నాక మీదుగా బౌద్ధ నగర్, వారాసిగూడ, సీతాఫల్మండి, మైలార్ గడ్డలో ముగియనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు అంబర్పేట్ నియోజకవర్గంలోని లింగంపల్లి రాఘవేంద్ర స్వామి టెంపుల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అనంతరం ఫీవర్ హాస్పిటల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, రెడ్ బిల్డింగ్ ఎక్స్ రోడ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, బాపునగర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, పటేల్ నగర్ ఎక్స్ రోడ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, మహాత్మ జ్యోతి పులె స్టాచ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్, డి మార్ట్, గోల్నాక ఎక్స్ రోడ్, స్ట్రీట్ కార్నర్ మీటింగ్, కృష్ణానగర్ అంబేద్కర్ స్టాచు స్ట్రీట్ కార్నర్ మీటింగ్, నింబోలి అడ్డ మహంకాళి టెంపుల్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహిచనున్నారు.

Read also: Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. భువనగిరిలో పబ్లిక్ మీటింగ్..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిన్న కిషన్​ రెడ్డి ప్రచారం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పదేండ్లు బీఆర్​ఎస్​ దోచుకుంటే.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ‘దేశం కోసం, మీ పిల్లల భవిష్యత్​ కోసం బీజేపీకి ఓటు వేయండి. మోదీని మరోసారి ప్రధానిని చేద్దాం. సికింద్రాబాద్​ ఎంపీగా నేను చేసిన అభివృద్ధి మీ ముందు పెట్టాను. నన్ను ఎంపీగా మరోసారి ఆశీర్వదించండి. నియోజకవర్గ అభివృద్ధిగా కృషి చేస్తాను. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలకు ఓటు వేసినా వృథానే. ఎందుకంటే కేంద్రంలో మళ్లీ వచ్చిది మోడీ ప్రభుత్వమే”అని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. ​
Rahul Gandhi: నేడు మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన..