Leading News Portal in Telugu

Amit Shah: నేడు వికారాబాద్ , వనపర్తి ల్లో అమిత్ షా సభలు


Amit Shah: నేడు వికారాబాద్ , వనపర్తి ల్లో అమిత్ షా సభలు

Amit Shah: తెలంగాణ నుంచి బీజేపీకి రెండంకెల సీట్లు రావాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చారు. చివరగా శనివారం హైదరాబాద్ నారాయణపేట ఎల్బీస్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మోడీ మొత్తంగా రాష్ట్రంలో పది బహిరంగ సభలు, అనేక రోడ్ షోలలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే మూడుసార్లు రాష్ట్రానికి వచ్చి బీజేపీ ప్రచారాన్ని ఊపందుకున్నారు. ఇవాళ మరోసారి వనపర్తి, వికారాబాద్‌లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ లో జరిగే జనసభలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం వనపర్తిలో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.


Read also: Adah Sharma : నా వేళ్ళని కుక్క పిల్ల తినేసింది,. ఆదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..

రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు వెళ్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. దీంతో బీజేపీ అగ్రనేతలు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం కూడా చేశారు. మరోసారి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కూటమి నేతలు ప్లాన్ చేశారు. ఈ మేరకు భీమవరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, అమిత్ షా పర్యటన రద్దు కావడంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది.
Adah Sharma : నా వేళ్ళని కుక్క పిల్ల తినేసింది,. ఆదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..