Leading News Portal in Telugu

CM Revanth Reddy : న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు


CM Revanth Reddy : న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు

రాష్ట్రంలోని న్యాయవాదుల ఆరోగ్య బీమాకు త్వరలోనే రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తనను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం మాట ఇచ్చారు. తమకు ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కోరారు. గతంతో పోలిస్తే న్యాయవాదుల సంఖ్య పెరిగిందని, అందుకు తగినట్లుగా న్యాయవాదుల సంక్షేమ సంఘానికి తగినంత ఆర్థిక సాయం అందించాలని విన్నవించారు.


‘న్యాయవాదుల వృత్తి పట్ల తనకు ఎంతో గౌరవముందని ముఖ్యమంత్రి అన్నారు. న్యాయ వాదుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, న్యాయవాదుల ఆరోగ్య బీమాకు తగినన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే సంక్షేమ సంఘానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సహకారం సోదర న్యాయవాదులందరికీ మేలు చేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.