Leading News Portal in Telugu

Nirmala Sitharaman: రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి మంచి మెజారిటీ వస్తుంది


Nirmala Sitharaman: రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపికి మంచి మెజారిటీ వస్తుంది

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిగులు ఆదాయంలో ఉన్న తెలంగాణ అప్పుల పాలయిందని, తెలంగాణ లో ప్రభుత్వం మారింది,కానీ ఇప్పటికీ ఉచితలు సంస్కృతి ఇంకా ఉంది,కాంగ్రెస్ అవినీతి కూడా పెద్ద ఎత్తున్న మొదలవుతుందన్నారు నిర్మలా సీతారామన్. తెలంగాణలో బీజేపీ కి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని, రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కి మంచి సపోర్ట్ ఉందని, విశాఖపట్నంలో నేను కూడా ప్రచారం చేశానని ఆమె వెల్లడించారు. అక్కడ చూశాను ఎన్డీఏ కూటమి కి బాగుందని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా ఏపీ లో ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజల మద్దతు ఉంటుందని నేను నమ్ముతున్నానని నిర్మలా సీతారామన్ అన్నారు.


ఇదిలా ఉంటే.. దేశంలో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024, జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఆ తర్వాత వెంటనే కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను విధానానికి సంబంధించి, అందులో మార్పుల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత.. కొత్త ప్రభుత్వం.. ఆదాయపు పన్ను వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. చాలా మంది దీనిని నిజమని నమ్మారు. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా రావడం గమనార్హం. అయితే ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ రిపోర్ట్‌ను, ఆ వార్తల్ని తోసిపుచ్చారు.