Leading News Portal in Telugu

Rythu Bharosa: గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. త్వరలో రైతు భరోసా..


  • తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..

  • త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించ బోతున్నామని ప్రకటన..

  • అర్హులైన రైతు లందరికీ రైతు భరోసా పథకం..
Rythu Bharosa: గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. త్వరలో రైతు భరోసా..

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది. అర్హులైన రైతు లందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఈ ఉప సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది.

Read also: Independence Day 2024: భారత ప్రధానులందరిలో సుదీర్ఘ ప్రసంగం.. మునుపటి రికార్డును అధిగమించిన మోడీ

వాటిని పరిగణనలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నాం. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోంది. కానీ, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనికి 33 రకాల వరిధాన్యాలను గుర్తించామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతుల సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్ లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178 కి పెంచాం. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. నకిలీ విత్తన అక్రమార్కులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది.
CM Revanth Reddy: దేశ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది..