Leading News Portal in Telugu

Damodara Raja Narsimha : మంకీపాక్స్‌పై ముందస్తు చర్యల్లో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష


Damodara Raja Narsimha : మంకీపాక్స్‌పై ముందస్తు చర్యల్లో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష

రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో మంకీ ఫాక్స్ పై ముందస్తు, నివారణ చర్యల్లో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో దేశంలో ఢిల్లీ కేరళ రాష్ట్రాలలో స్వల్ప కేసులు 15+15(30) నమోదు అయ్యాయని మంత్రి దామోదర్ నరసింహ గారి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. రాష్ట్రంలో మంకీ ఫాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 Ajwain: వానాకాలంలో వాముతో ఎన్ని ప్రయోజనాలో..!

తెలంగాణ రాష్ట్రంలో మంకీ ఫాక్స్ నివారణ కు తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. మంకీ పాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. హైదరాబాదు లోని గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి లలో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచేలా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రభుత్వ ఆసుపత్రులలో మంకీ ఫాక్స్ వైరస్ కు నివారణ మందులు, అవసరమైన కిట్స్ అందుబాటులో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

 Congress leader: కర్ణాటక గవర్నర్‌కి ‘‘బంగ్లాదేశ్’’ గతే.. వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ నేత..