- రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి..
-
ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి.. - నలబై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు ఇంతవరకు చేయలేదు..

Bandi Sanjay: చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ..
రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి అని ప్రశ్నించారు. ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నలబై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు ఇంతవరకు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.
Rea also: BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు
ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది కలలు కంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీ అవినీతి పార్టీని మేము చేర్చుకోమన్నారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టాలి .. కానీ ఇంతవరకు పెట్టలేదన్నారు. విలీనం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు.. అప్పట్లో కాంగ్రేస్ లో బీఆర్ఎస్ ని విలీనం చేస్తా అని మాట తప్పాడన్నారు. కేటీఆర్ బతుకు ఎటుగాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Raksha Bandhan 2024: రాఖీ ఇలా కడుతున్నారా?..