Leading News Portal in Telugu

School Holiday: విద్యాశాఖ అలర్ట్.. నేడు పాఠశాలలకు సెలవు


  • తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ ..

  • రంగారెడ్డి జిల్లా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలలకుసెలవు ప్రకటించిన డీఈవో ..
School Holiday: విద్యాశాఖ అలర్ట్.. నేడు పాఠశాలలకు సెలవు

School Holiday: గ్రేటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై విద్యాశాఖ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావం తీవ్రంగానే ఉంది. పరిస్థితిని బట్టి సెలవులు ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవో, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు గంటల పాటు నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read also: Rain Alert: హైదరాబాద్‌ కు భారీ వర్ష సూచన.. ప్రజలకు జీహెచ్‌ఎంసీ హెచ్చరిక…

భాగ్యనగరానికి జీహెచ్‌ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సోమాజిగూడ, ఫిలింనగర్, షేక్‌పేట్, సనత్ నగర్, కూకట్‌పల్లి, ముసాపేట్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, అశోక్ నగర్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, కోతన్యాయత్‌నగర్, చైతన్యపూర్ , సికింద్రాబాద్, రసూల్‌పురా, బోయిన్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, చింతల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, మల్కాజిగిరిలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో భాగ్యనగరం అంధకారంలో ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.