- బీజేపీ- బీఆర్ఎస్ ప్రతి పక్షాల తప్పుడు ప్రచారంతో రైతులు కంగారు పడొద్దు..
-
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేస్తున్నాం..

Ponnam Prabhakar: కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే.. కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 లోపు రూ.2 లక్షలు రుణాలు పొందిన రైతులందరికి రుణమాఫీ జరుగుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రతి పక్షాల తప్పుడు ప్రచారంతో రైతులు కంగారు పడొద్దన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విదంగా తెలంగాణాలో 2లక్షల రుణమాఫి ఒకేసారి చేసిన ఘనత మాదే అన్నారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలో ఉండి రైతులకు ఏమిచేశారని ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లు బదలాయింపు చేసుకున్న 8 సీట్లు దాటలేదన్నారు.
Read also: Ponguleti Srinivasa Reddy: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేస్తున్నాం మిగిలినవి పూర్తి చేసే పనిలో ఉన్నామన్నారు. రాఖీ పండుగ సందర్బంగా అక్కా చెల్లెలు సంతోషంగా బస్సులో ప్రయాణిచేందుకు కృషి చేసిన ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు, దాదాపు 15 కోట్ల ఆదాయం సమాకూరిందన్నారు. దేశంలో సాంకేతిక విప్లవం తెచ్చిన రాజీవగాంధీ విగ్రహాన్ని సెక్రటరీ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తామన్నారు. అవగాహన లేకుండా కేటీఆర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని మాట్లాడడం సరికాదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉందా కేటీఆర్? అని ప్రశ్నించారు. కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తుండని కీలక వ్యాఖ్యలు చేశారు.
Tension in Siddipet: సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్..