Leading News Portal in Telugu

N. Indrasena Reddy: నేడు తుంగతుర్తికి త్రిపుర గవర్నర్‌..


  • సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నేడు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి పర్యటన..

  • గవర్నర్ అయిన తరువాత తొలిసారి తన సొంత గ్రామానికి..
N. Indrasena Reddy: నేడు తుంగతుర్తికి త్రిపుర గవర్నర్‌..

N. Indrasena Reddy: సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నేడు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి పర్యటించనున్నారు. గవర్నర్ అయిన తరువాత తొలిసారి తన సొంత గ్రామానికి ఇంద్రాసేనా రెడ్డి రానున్నారు. తన సొంత గ్రామం గానుగుబండ లోని సిరి ఫంక్షన్ హాల్ లో గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాగా.. త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా తుంగతుర్తి మండల పరిధిలోని గానుగుబండ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఇటీవల నియమితులయ్యారు. ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.

Read also: Bigg Boss Telugu 8: సీన్ రివర్స్.. బిగ్‌బాస్‌ 8 నుంచి వేణు స్వామి అవుట్! కారణం ఆ హీరోనేనా?

అనంతరం తాను పుట్టి పెరిగిన గ్రామమైన గానుగుబండకు వెళ్లి అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తులు, బంధువులతో సమావేశమవుతారు. ఇంద్రసేనారెడ్డికి ఘనస్వాగతం, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా తెలిపారు. ఈ సమావేశం అనంతరం నేడు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గం కల్లెడ గ్రామంలో పర్యటిస్తారు. కన్నడ గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒకేషనల్ జూనియర్ కాలేజ్ స్టాఫ్ కోసం నిర్మించిన వసతిగృహాలలో ప్రారంభించనున్నారు.

Kishan Reddy: బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్.. ప్రారంభించనున్న కిషన్ రెడ్డి