Leading News Portal in Telugu

Kaleshwaram Project: నేటి నుంచి కాళేశ్వరం ఆనకట్టల అఫిడవిట్లపై విచారణ..


  • నేటి నుంచి మేడిగడ్డ- అన్నారం-సుందిళ్ల డ్యామ్‌ల విచారణ ప్రారంభం..

  • విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్..
Kaleshwaram Project: నేటి నుంచి కాళేశ్వరం ఆనకట్టల అఫిడవిట్లపై విచారణ..

Kaleshwaram Project: నేటి నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామ్‌లకు సంబంధించి విచారణ ప్రారంభం కానుంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, సీనియర్ అధికారులు, పదివీ విరమణ చేసిన అధికారులను విచారించింది. కమిషన్ వారి నుంచి అవసరమైన విషయాలను అడిగి అందరి నుంచి అఫిడవిట్లను స్వీకరించింది. ఇప్పటి వరకు 57 మంది కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు. తదుపరి దశలో, కమిషన్ వారందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంది. ఆ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. కమిషన్‌ పనిచేస్తున్న బీఆర్‌కే భవన్‌లో ఈ బహిరంగ విచారణ ప్రక్రియ జరగనుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు దాఖలు చేసిన వాస్తవాల ఆధారంగా ప్రశ్నించి.. ఆధారాలు కూడా నమోదు చేయనున్నారు.

Read also: PM Modi: 45 ఏళ్ల తర్వాత పోలెండ్ పర్యటనకు ప్రధాని మోడీ..

ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. తమ వెంట లాయర్లను తీసుకురావాల్సిన వెసులుబాటు కూడా ఉంది. రోజుకు ఒకరిద్దరు కమిషన్ విచారణ: నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా సుదీర్ఘకాలం పనిచేసిన మురళీధర్ తొలిరోజు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా మురళీధర్‌ను ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులు, సమస్యల తీవ్రతను బట్టి కమిషన్ రోజుకు ఒకటి లేదా రెండు కేసులను దర్యాప్తు చేస్తుంది. వాటి ఆధారంగా అవసరమైతే ఇతరులకు కూడా కమిషన్ నోటీసులు జారీ చేస్తుంది. డ్యామ్‌లపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సోమవారం కమిషన్‌కు మధ్యంతర నివేదికను సమర్పించింది. కమిషన్ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటుంది.
Barack Obama: ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్‌ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు..