Leading News Portal in Telugu

T. Harish Rao: రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..


  • రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..

  • రైతు భరోసా-రైతు రుణమాఫీ పూర్తి అయ్యే వరకు మా పోరాటం ఆగదు..
T. Harish Rao: రైతు రుణ మాఫీపై  ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..

T. Harish Rao: రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట హరిత టూరిజం హోటల్ లో హరీష్ రావు మాట్లాడుతూ.. అక్రమ కేసులతో రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. రైతుల రుణం మాఫీ చేయకుండా రైతులతో రణం చేస్తున్నారు సీఎం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి రైతుకు రుణ మాఫీ జరిగేంతవరకు రైతులకు అండగా ఉంటామన్నారు. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలన్నారు. ఆరు గ్యారంటీ లతో అసెంబ్లీ ఎన్నికల్లో… రైతు రుణ మాఫీ పేరుతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగారు సీఎం అన్నారు.

Read also: Radha Family: రాధను చంపింది పోలీసులా? మావోయిస్టులా?.. మాకు తెలియాలి..

పాపం రేవంత్ రెడ్డి చేస్తే.. దేవుడు ప్రజలను శిక్షించవద్దని శ్రీ లక్ష్మి నరసింహ స్వామీని వేడుకున్నం అన్నారు. రేవంత్ రెడ్డి దైవ ద్రోహానికి పాల్పడ్డారని తెలిపారు. సీఎం ఒకలా, మంత్రులు మరోలా రుణమాఫీపై ప్రకటనలు చేయడం వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. రైతు రుణ మాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి… దేవుళ్ళ దగ్గర ప్రయశిత్తం చేసుకోవాలన్నారు. అన్ని రకాల వడ్లకు బొనస్, రైతు భరోసా వచ్చేంత వరకు.. రైతు రుణమాఫీ పూర్తి అయ్యే వరకు మా పోరాటం ఆగదన్నారు. 2 లక్షలకంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు బేషరతుగా 2 లక్షలు చెల్లించాలన్నారు. సీఎం ప్రమాణం చేసిన అన్ని ఆలయాలకు, చర్చలకు వెళ్తామన్నారు.
బొద్దింకలను పాదాలతో నలిపితే సైడ్ ఎఫెక్ట్స్..!