Leading News Portal in Telugu

Doctors Negligence: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. కుర్చీలోనే మహిళ డెలివరీ..


  • నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..

  • కూర్చున్న కూర్చీలోనే డెలివరీ అయిన అశ్వనీ అనే మహిళా..

  • నిర్లక్ష్యం వహించిన వైద్యుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం..
Doctors Negligence: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. కుర్చీలోనే మహిళ డెలివరీ..

Doctors Negligence: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అశ్విని అనే మహిళ కుర్చీలోనే డెలివరీ అయింది. ఈరోజు తెల్లవారు జామున ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించింది. పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పినా సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకోవడానికి ఒప్పుకోకపోవడంతో.. గర్భిణీ అశ్వనీ కుర్చీలో కూర్చుండగానే తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో రక్తస్రావం చూసిన వైద్యులు, వైద్య సిబ్బంది ఒక్కసారిగా పరుగులు పెట్టి నానా హాంగామా చేశారు.

అయితే, నేరేడుగోమ్మకు చెందిన అశ్వినీకి పురిటి నొప్పులు రావడంతో దేవరకొండలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించారు. మూడవ కాన్పుకు పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తక్షణమే వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు హస్పటల్ ముందు ఆందోళనకు దిగారు.