- టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేవీపీ..
-
పురాణాల్లో కర్ణుడి గురించి వెంటే.. ఈ తరంలో ప్రకాశం పంతులు గురించి విన్నా.. -
ప్రకాశం పంతులు సేవలు.. త్యాగాలు మరువలేనివి: కేవీపీ రామచంద్ర రావు

KVP Ramachandra Rao: అసెంబ్లీ ముందున్న టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా ప్రదాత టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. పురాణాల్లో కర్ణుడి గురించి విన్నాం.. ఈ తరంలో ప్రకాశం పంతులు గురించి విన్నామన్నారు. ఆయన ఓ జ్ఞానశీలీ, త్యాగశీలి.. ఆ రోజుల్లో ఆయనకున్న సంపద జమీందారులకు మించినది.. ప్రకాశం పంతులుకు ఉన్న పేరు ప్రతిష్టలు అనాడున్న కాంగ్రెస్ నేతలకు అసూయ కలిగేలా ఉండేది.. ఆయన సేవలు, త్యాగాలు మరువలేనిది.. ఆయన చరిత్ర పూర్తి స్థాయిలో బయటకు రాలేదు.. ఆయన బయోగ్రాఫి పూర్తి స్థాయిలో బయటకు తీసుకు వచ్చి భావిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.. వాళ్ళ కుటంబ సభ్యులను కలుసుకుని అయన చరిత్ర తెలుసుకుని సమాజం ముందు ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు పేర్కొన్నారు.
ఇక, టంగుటూరి ధైర్య సహాసాలు, నీతి, నిజాయితీ తెలుగు పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బ్రిటిష్ తుపాకులకు గుండెను ఎదురొడ్డిన.. స్వాతంత్ర్య సమర యోధుడు, ధైర్య శీలి, మహానేత అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయం అని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమానికి తన జీవితాన్ని పనంగా పెట్టిన మహనీయుడు.. టంగుటూరి ఆదర్శ ప్రాయుడు.. యువత టంగుటూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.. ఆయన స్ఫూర్తితో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాసిన అవసరం యువత మీద ఉంది అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.