- భారీగా తగ్గిపోయిన టమాట ధరలు..
-
ఆకాల వర్షం.. పంటకు తెగుళ్లతో తగ్గిన పంట దిగుబడి.. -
టమాట పంటకు కనీస మద్దతు ధర రాకపోవడంతో బోరున విలపిస్తున్న అన్నదాతలు..

Tomato Price: ఆరుగాలం కష్టపడి లక్షల రూపాయల ఖర్చు చేసి టమాటా సాగు చేస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటా రైతుల ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు తగ్గడం, అదే టైంలో గిట్టుబాటు ధరలు లభించక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటకు తెగుళ్లు సోకి, ఊజీ ప్రభావంతో దిగుబడులు తగ్గిపోయాయి.. వచ్చిన కాస్తా పంట నాణ్యత లోపించడంతో పాటు 15 కిలోల పెట్టె జూన్‌లో రూ.800- రూ.1000 మధ్య పలికితే.. ప్రస్తుతం రూ.250- రూ.300 మాత్రమే వస్తోంది అంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, టమాటా సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఎకరాకు రూ.1.50 లక్షల – రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోంది అని అన్నదాతల అంటున్నారు. మూడేళ్ల కిందట ఇందులో సగం ఖర్చులే వచ్చేవి.. అప్పుడున్న ధరలే ప్రస్తుతం మార్కెట్‌లో కొనసాగుతున్నాయన్నారు. వాతావరణ పరిస్థితులన్నీ సహకరిస్తే 15 నుంచి 19 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది.. కానీ, ప్రస్తుతం వివిధ కారణాలతో 10 క్వింటాళ్లకు మించడం లేదంటున్నారు రైతుు. టమాటా కోతలు, మార్కెట్‌కు తరలింపు, రవాణా, ఎగుమతి దిగుమతి ఖర్చులు లెక్కిస్తే ఒక్కో బాక్సుకు 40 రూపాయల వరకు వ్యయమైతుంది. ఒక్కో బాక్సుకు కమీషన్ 10 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఇలా అన్నింటిని భరించి విక్రయించినా ప్రస్తుత ధరలతో రైతుకు భారీ నష్టమే మెలుగుతుంది అన్నారు.
ఇక, మే, జూన్ నెలలలో టమాటా ధరలు ఆశాజనకంగా ఉండటం వల్ల.. దీంతో రైతులు అధికంగా ఈ పంట సాగు చేశారు. సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో ధరలు పెరుగుతాయి. అలాగే, ఇతర రాష్ట్రాల్లో పంట లేక అక్కడి వ్యాపారులు ఇక్కడికి రావడంతో కూడా టమాట ధరలు తగ్గడనికి ఒక కారణంగా అన్నదాతలు చెప్పుకొస్తున్నారు. జులై, ఆగస్టులో వాతావరణం చల్లబడి దిగుబడులు ఎక్కువగా పెరుగుతాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటకు తెగుళ్లు సోకి దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో భారీ నష్టాలను రైతులు చూస్తున్నారు.