Leading News Portal in Telugu

Nalgonda Govt Hospital: వైద్యుల నిర్లక్ష్యం.. శిశువు మృతి!


  • నల్లగొండ జిల్లాలో దారుణం
  • మెటర్నటీ డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యం
  • భూమ్మీదికి రాకముందే శిశువు మృతి
Nalgonda Govt Hospital: వైద్యుల నిర్లక్ష్యం.. శిశువు మృతి!

Nalgonda Govt Hospital: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నల్లగొండ ప్రభుత్వాసుపత్రి మెటర్నటీ డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ శిశువు భూమ్మీదికి రాకముందే మృతి చెందింది. నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపులోనే శిశువు చనిపోయింది. దాంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు.

నొప్పులతో బాధపడుతున్న మహిళ పట్ల నల్లగొండ ప్రభుత్వాసుపత్రి డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నొప్పులు భరించలేని ఆ మహిళ ప్రైవేటు హాస్పటల్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. అప్పుడు తామే డెలివరీ చేస్తామంటూ డాక్టర్లు, సిబ్బంది ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. మహిళకు ఆపరేషన్ చేయగా.. శిశువు (బాబు) అప్పటికే మృతి చెందింది. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాబు చనిపోయారంటూ బంధువుల ఆందోళన చేస్తున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ ​ముందు ఆందోళన నిర్వహించారు. బాబు మృతికి కారణమైన డాక్టర్​తో పాటు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.