Leading News Portal in Telugu

CM Revanth Reddy: క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: రేవంత్ రెడ్డి


CM Revanth Reddy: క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Speech at NMDC Hyderabad Marathon: దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని, క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందన్నారు. తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని సీఎం చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

‘క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తామని మాట ఇస్తున్నా. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతాం. ఒలంపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్‌లో ప్రారంభించబోతున్నాం. అంతర్జాతీయ స్ధాయి కోచ్‌లను తీసుకొచ్చి క్రీడలకు శిక్షణ అందిస్తాం. ఒలింపిక్స్‌ను హైదరాబాద్ నగరంలో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో మన స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపాం. దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.